telangana
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక
సూర్య.నేరడిగొండ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనారు.ఈ నెల 24న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-17 ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో జెడ్పీ పాఠశాల విద్యార్థి జీ. విద్యావర్ధన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆయన ప్రదర్శనను గుర్తించిన నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ వివరాలు వెల్లడిస్తూ.. ఎంపికైన విద్యార్థి విద్యావర్ధన్ ఈ నెల 27 నుండి 29 వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.ప్రభుత్వపాఠశాలలోచదువుతూనే క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. విద్యార్థి విద్యావర్ధన్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, బుగ్గారం గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. అతడు రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించి పాఠశాలకు తాను పుట్టి పెరిగిన గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని బుగ్గారం గ్రా మస్తులు ఆకాంక్షిరు.