BREAKING
తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

Select Suryaa Now
 ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నందన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నాగరాజకుమారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురించి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.  ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటు వేసి తమ ఓటు చెల్లుబాటు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ముందుగానే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపీ,  ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు అక్టోబర్ 27, 28 తేదీల్లో, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలకు అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట డిఇఓ బాలాజీ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.