ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచి కృష్ణపట్నం ఎంపిటిసి స్థానం బిట్-2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దింపినారని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ అభ్యర్థి మోచెర్ల మురళీకృష్ణ మంగళవారం రాత్రి గోపాలపురం ప్రాంతంలో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగించారు. స్థానిక అధికార పార్టీ నాయకులు సతీష్, మండల తెలుగు యువత అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, కృష్ణపట్నం ఆలయాల చైర్మన్ మామిడాల శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎన్నికల నిబంధనలు పాటించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు