57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ
నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని 57వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు రాణా ప్రమోద్ రెడ్డి, 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అస్మా మస్తాన్, నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అలీం, నగర వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యస్దాని పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో 57వ డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది. ఈ ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.