BREAKING
ఓవర్సీస్‌ బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డు వసూళ్లు.. విజయ్ దేవరకొండ సంచలనం జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు బెల్ట్ షాపుల నిర్వహణపై సర్పంచ్ ల ఆగ్రహం.... భట్టిప్రోలు మండలంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బాలల భద్రతకు ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’.. పోక్సో చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై 1,650 మందికి పైగా విద్యార్థులకు న్యాయమూర్తుల అవగాహన " అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి" వి బి జి రామ్ పనులపై శిక్షణ...... అబుదాబిలో ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, శిఖర్ ధావన్.. వైరలవుతున్న పిక్స్ రుణం తీర్చుకుంటా అవకాశం కల్పించండి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ అనిరుధ్, కావ్య మారన్ చెన్నై రిసెప్షన్ ఇన్విటేషన్ వైరల్.. ఆ ఒక్క టాలీవుడ్ హీరో ఎవరంటే ఆర్ వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు ‘స్వేచ్ఛ రథం’.. వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మేడ్చల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం 20వ వార్డులో పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరిక మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యత -రాజీవ్ గాంధీ కాలనీ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఈదగాలి గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్

తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

Select Suryaa Now
తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

*ప్రజలు పాటించాల్సిన విద్యుత్ భద్రతా సూచనలు:*

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి.

తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వాటికి దూరంగా ఉండాలి.

నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలు, స్తంభాల సమీపానికి వెళ్లకూడదు.

ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు, ఇతర విద్యుత్ ప్రమాదాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అత్యవసర సహాయం కోసం APCPDCL టోల్‌ఫ్రీ నంబర్ *1912*ను సంప్రదించాలి.

*జిల్లాల వారీగా APCPDCL కంట్రోల్ రూమ్ నంబర్లు:*

* కృష్ణా: 6281709355

* ఎన్టీఆర్: 9440817561

* గుంటూరు: 9440817526

* బాపట్ల: 9281413774

* ప్రకాశం: 9440817491

* పల్నాడు: 7661019447

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎండీ అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రజలు విద్యుత్ భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, తుఫాన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది.