17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : మండలంలోని 17 ఎంపిటిసి స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని దీనికి సంబంధించిన జాబితా విడుదల చేశామని ఎంపిటిసి ఎన్నికల కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు అన్నారు. మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ పూర్తికాగా తుది జాబితాను ఆయన ప్రకటించారు. తెలుగుదేశం 17, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 17, సిపిఎం3 , బహుజన్ సమాజ్ పార్టీ 1 , స్వతంత్ర అభ్యర్థులు ఐదు మంది పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించామన్నారు. ఎంపిటిసి అభ్యర్థి ఎన్నికల్లో ప్రచార ఖర్చు కింద నాలుగు లక్షలు ఖర్చు పెట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని అన్నారు