andhrapradesh
అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపల్ ఎన్నికల రేసులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రచారం వేగవంతమైంది. రోజురోజుకూ తెదేపా అభ్యర్థులకు ప్రజలు, వివిధ సంఘాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగా ఈరోజు పట్టణానికి చెందిన బులియన్ మర్చంట్స్, టైలర్స్ యూనియన్ ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ ను కలిసి మద్దతు తెలిపారు. అద్దంకి పట్టణాభివృద్ధికి, వర్తక, వ్యాపార వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం తమ సంఘాల తరఫున పూర్తి మద్దతు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో మద్దతు తెలిపిన బులియన్ మర్చంట్, టైలర్ యూనియన్ సభ్యులకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ, అద్దంకి మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు.