BREAKING
నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్ విజన్ ఆఫ్ రామాయణ స్పెషల్ వీడియో విడుదల.. మైండ్ బ్లాకింగ్ మేకింగ్ విజువల్స్‌తో రణ్ బీర్, సాయిపల్లవిల హంగామా బ్రెజిల్‌లో తీవ్ర రాజకీయ దుమారం చిన్న పిల్లల వైద్యుడు డా. హరి మృతి రాష్ట్రం బాగుండడమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే విజయచంద్ర వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ నాయుడు . ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అద్భుత ప్రతిభ కంబదూరు జెడ్పిటిసి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి హారిక చంద్రమౌళి. నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి/ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంతో ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం ఆగదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తే అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం ఆయన చేపట్టిన నాలుగు రోజుల ప్రజా ఉద్యమ పాదయాత్ర మంగళవారం ఏదులాబాద్‌లో ప్రారంభమైంది.ఏదులాబాద్‌లోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి కాలుష్య ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులు, యాదవులు, స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో కాలుష్య పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజల తరఫున పోరాడారని గుర్తుచేశారు. అప్పట్లో న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారని పేర్కొన్నారు. నేడు ఆయనే ముఖ్యమంత్రి అయినప్పటికీ బాధితులకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.డంపింగ్ యార్డ్ సమస్యను తాను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపిస్తే నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక, సాంకేతిక సహకారం అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.డంపింగ్ యార్డ్ ప్రభావంతో చెరువులు కలుషితమవుతున్నాయని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని, స్థానిక ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం, తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యర్థాల సమస్యను గణనీయంగా తగ్గించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం పోరాడినట్లుగానే, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు, చివరి రోజు బాలాజీనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా రూరల్ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు సామా రంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, భరత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్, శిల్పా రెడ్డి, రవీందర్ నాయక్, కనుకుల రజినీకాంత్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, చలువాది ప్రవీణ్ రావు, బసవరాజు, నర్మద, బానోతు మల్లికార్జున్ తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.