ఘనంగా ఎన్. నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
మోమిన్‌పేట, మేజర్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉత్తమ గ్రామపంచాయతీ జాతీయ అవార్డు గ్రహీత ఎన్. నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మోమిన్‌పేటలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, గజమాలతో నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం డీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పలువురు నాయకులు ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నరసింహారెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దబ్బని వెంకట్, సర్పంచులు బండ విష్ణువర్ధన్ రెడ్డి, పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్, అరుణ, బిచ్చయ్య, కిష్టయ్య చౌహన్, లక్ష్మీ రాజు, బంటారం సర్పంచ్ దుర్గం మల్లేశం, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.