మోడీపై కుట్రలు చేస్తే సహించేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోడీపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మోడీని రాజకీయంగా దెబ్బతీయలేరని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోడీని, ఆయన తండ్రిని జైలులో వేస్తామంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, సీనియర్ నాయకుడు పాండు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కేశవులు, నవీన్ కుమార్, మల్లేష్ పటేల్, నరోత్తం రెడ్డి, హరికృష్ణ, యువమోర్చా నాయకుడు చిట్యాల సాయిచరణ్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.