BREAKING
తుఫాన్ పునరవాస కేంద్రంలో 30 మంది ఆశ్రయం తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చోడపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థికి బి-ఫారం అందజేత టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామునాయుడుకు బి-ఫారం అందజేత ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు.. దేవరయాంజాల్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు అర్ణబ్ తుఫాన్ ఎఫెక్ట్. కూటమి అభ్యర్థులకు బి ఫాం పంపిణీ అచ్యుతాపురం మండలంలో బోణి కొట్టిన వైఎస్ఆర్సిపి మా తల్లిని ఆదరించండి... -క్రాంతి నగర్ ప్రచారంలో యువరాజు రెడ్డి ప్రచారం ఎమ్మెల్యే పాయం ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎఫ్ డి ఓ రాధిక ప్రజాసేవే ధ్యేయం.. పినగాడి ఎంపీటీసీ రేసులో చెరువు సంఘం అధ్యక్షుడు సదరం భీమేశ్వరరావు ధర్మపత్ని సదరం జగతి తుపాను వేళ బాధితులకు బాసటగా నిలవాలి.. నదీ తీర ప్రజలు అప్రమత్తం ​విద్యుత్ తీగలు తగిలి వృద్ధుడి దుర్మరణం మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రచారం

అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం

Select Suryaa Now
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం

బాపట్ల,  మేజర్‌న్యూస్‌ :

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నాబ్ తుఫాను బాపట్ల జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలతో పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు తెలిపారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, పోలీసుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాను బాపట్ల జిల్లాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలా ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే SDRF బృందాలు రేపల్లె, నిజాంపట్నం ఓడరేవు ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని, డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో QRT బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 6 మండలాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 127 గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల ప్రజలకు ముందస్తు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నామని వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

తుఫాను సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు SDRF, QRT మొత్తం 5 బృందాలు అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచామని ఎస్పీ గారు తెలిపారు. డ్రాగన్ లైట్లు, మెగాఫోన్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, వుడ్ కట్టర్లు, చైన్‌సాలు, రేడియం జాకెట్లు, ఎల్‌ఈడీ లైట్లు, లైఫ్‌బాయ్‌లు, జేసీబీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లతో పాటు గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో అవసరమైన చోట్ల 6 రిసీవర్ టవర్లను, 122 మాన్ పాక్స్, 6 వీహెచ్‌ఎఫ్ సెట్ల ద్వారా వేగవంతమైన సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ముఖ్యంగా తుఫాను సమయంలో జాతీయ రహదారులు 16, 216, 167(A)లపై ప్రయాణించే భారీ వాహనాలు, కంటైనర్ల రాకపోకల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు తెలిపారు. తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో నిలిపివేయాలని సూచించారు. తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు తావులేకుండా ప్రయాణికులు, వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

ఇప్పటికే ప్రముఖ బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశామని, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటకులు బీచ్‌ల వద్దకు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సబ్‌డివిజన్ స్థాయిలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా ప్రజలు అవసరమైన సహాయం పొందవచ్చని సూచించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎస్పీ గారు తెలిపారు.

లోతట్టు ప్రాంతాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉండే ప్రదేశాలు, పొంగిపొర్లే కల్వర్టులు, వాగులు, వంకల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి, ప్రజలు ప్రమాదకర ప్రాంతాలను దాటకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

స్థానిక సచివాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తుఫాను ప్రభావంపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. తుఫాను సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, వరద నీరు ప్రవహించే ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దని, పోలీస్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం జిల్లా కమాండ్ కంట్రోల్ నంబర్ 833813228 లేదా 112కు ఫోన్ చేయాలని సూచించారు.