తుఫాన్ పునరవాస కేంద్రంలో 30 మంది ఆశ్రయం
రావికమతం అక్టోబర్ 27 మేజర్ న్యూస్: రావికమతం హైస్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రంలో 30 మంది ఆశ్రయం పొందుతున్నారని వీఆర్వో శంకర్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రావికమతం లో రేకుల షెడ్ లో పెంకుటిల్లు పూరీల్లు లలో నివసిస్తున్న వారిని తుఫాన్ తీవ్రత దృష్ట్యా పునరావసా కేంద్రానికి రావాలని కోరేమన్నారు. ఈ మేరకు తరలివచ్చిన వారికి ఆహారము, త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. తీవ్రత తగ్గేవరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తామన్నారు