మా తల్లిని ఆదరించండి... -క్రాంతి నగర్ ప్రచారంలో యువరాజు రెడ్డి ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లి పుష్పవతిని ఆదరించి గెలిపించాలని ఆమె కుమారుడు యువరాజు రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జీవకోనలోని ఆర్టీసీ కాలనీ, క్రాంతి నగర్ ప్రాంతంలో పుష్పవతి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నగరంతో పాటు డివిజన్ ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేసి, తన తల్లి పుష్పవతికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి మాట్లాడుతూ గెలిచిన వెంటనే డివిజన్లోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు శ్రీనివాస్ యాదవ్, గంట సుబ్బు, భువన్ చంద్ర, లక్ష్మీ శివ శశిరేఖ పవన్, దేవి, జానకిరామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మార్కెట్ మణి, రాజేశ్వరి, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్