టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామునాయుడుకు బి-ఫారం అందజేత
మాకవరపాలెం, అక్టోబర్ 27 మేజర్ న్యూస్:
మాకవరపాలెం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లు రామునాయుడుకు పార్టీ అధికారిక బి-ఫారం అందజేశారు. చింతకాయల పద్మావతి చేతుల మీదుగా ఆయన బి-ఫారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్.వై. పాత్రుడు పాల్గొన్నారు. పార్టీ అధికారిక అభ్యర్థిగా బి-ఫారం అందుకోవడంతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.