మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గత పాలకుల నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారైన చంద్రశేఖర్ రెడ్డి కాలనీని మరింత సుందరంగా, మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానని 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ తెలిపారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మంగళవారం ఉదయం, సాయంత్రం డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలలో మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ డివిజన్లోనే కాపురం ఉంటున్న తాను ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వెంటనే మీ ఇంటి దగ్గరికి వచ్చి సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమతోపాటు ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి జేబి శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె నరేంద్ర, దివాకర్, కళ్యాణ్, ఢిల్లీ, సందీప్, కిషోర్, మునుస్వామి, ఆల్వార్ మురళి, సాయి యాదవ్, కవిత, నిత్య, చిన్ని, గోకుల్, తిరుమలేష్, కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్