కూటమి అభ్యర్థులకు బి ఫాం పంపిణీ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగంగవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులకు బీఫారాల పంపిణీ పూర్తయింది. ప్రత్యేక కార్యక్రమంలో తెదేపా తరఫున 13 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్,మండల తెదేపా అధ్యక్షుడు మేడిశెట్టి రవికుమార్, తెదేపా సీనియర్ నాయకులు పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను),ఎంపీపీ అభ్యర్థి చుండ్రు సూర్యకుమారి బీఫారాలు అందజేశారు. మరో ఐదు స్థానాల్లో జనసేన తరఫున పోటీ చేస్తున్న కుడుపూరు, బాలాంతరం, సచ్చివాడ, సుందరపల్లి, కూళ్ల అభ్యర్థులకు పార్టీ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ బీఫారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.