BREAKING
రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన 39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా.... జొన్న రొట్టె తింటున్నారా.. మీ ఆహారంలో ఈ సిరిధాన్యాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే చైనాలో పేలిన ఏఐ బుడగ? నాలుగు నెలల్లో 40% పతనమైన స్టార్‌50 మా అమ్మను 13 వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్ కూటమిలో యాదవులకు పెద్దపీట -యాదవులను రబ్బర్ స్టాంప్ లా వాడుకున్న వైసీపీ -నేను యాదవులతో కలిసి పెరిగాను-నాపై అసత్య ప్రచారం దారుణం -14 మంది యాదవులకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఘనత టిడిపిది -కూటమి అభ్యర్థులను గెలిపించండి: మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు

అర్ణబ్ తుఫాన్ ఎఫెక్ట్.

Select Suryaa Now
అర్ణబ్ తుఫాన్ ఎఫెక్ట్.

అనకాపల్లి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్: అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, ఎస్డీపీఓ అనకాపల్లి పి.వి.వి. నరసింహారావు మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎస్డీపీఓ, సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, సిబ్బందితో కలిసి గత ఏడాది భారీ వరదలకు గురై రహదారులు తెగిపోయిన వెంకుపాలెం, కుంచంగి గ్రామాలను సందర్శించి, గ్రామస్తులతో మాట్లాడి సంసిద్ధతను పరిశీలించారు. అనంతరం కొప్పాక గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఉన్న ఏలేరు కాలువను పరిశీలించారు. జాతీయ రహదారిపై నీరు నిలిచిపోకుండా ఉండేందుకు జీవీఎంసీ సహకారంతో నీటి ప్రవాహానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దు. లోతట్టు ప్రాంతాలు, పూరి గుడిసెలు, బలహీనమైన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు / పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు, పడవలు, వలలను సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలి. బలమైన గాలులు వీచే సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండరాదు. త్రాగునీరు, మందులు, టార్చ్ లైట్, చార్జ్ చేసిన మొబైల్ ఫోన్లు, ముఖ్యమైన పత్రాలతో అత్యవసర కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో 100 / 112 కు డయల్ చేయాలి లేదా స్థానిక పోలీస్ / రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తుఫాన్ పై వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎస్డీపీఓ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్డీపీఓ అనకాపల్లి పి.వి.వి. నరసింహారావు, సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.