BREAKING
అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ఖతార్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సద్భావన ప్రదర్శించాలి...ఖతార్ స్పష్టీకరణ విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నుంచి కోబలి ఫుల్ వీడియో సాంగ్ విడుదల అర్నబ్ తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత కోనసీమ ప్రజలకు అండగా ఉంటా 'ఆర్నబ్’ తుఫాన్ కు అనకాపల్లి జిల్లా పోలీస్ హై అలర్ట్ - సర్వసన్నద్ధం. ఉక్రెయిన్‌కు క్రిప్టో విరాళాల సమాచారం బహిర్గతం చేసిన బైనాన్స్ తుఫాన్ పునరవాస కేంద్రంలో 30 మంది ఆశ్రయం తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చోడపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థికి బి-ఫారం అందజేత టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామునాయుడుకు బి-ఫారం అందజేత ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు.. దేవరయాంజాల్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు అర్ణబ్ తుఫాన్ ఎఫెక్ట్. కూటమి అభ్యర్థులకు బి ఫాం పంపిణీ

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

Select Suryaa Now
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

 కమిషనర్ టి. వెంకట కృష్ణయ్య

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

    ఒంగోలు కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ టి. వెంకట కృష్ణయ్య గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు. 

    

      ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 62 వార్డులకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 1,92,873 కాగా, వీరిలో 92,228 మంది పురుష ఓటర్లు, 1,00,591 మంది మహిళా ఓటర్లు, 54 మంది ఇతర ఓటర్లు ఉన్నారని కమిషనర్ తెలిపారు. వీరి కోసం మొత్తం 224 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ పదవికి 14 మంది అభ్యర్థులు, అలాగే 62 వార్డులకు వివిధ రాజకీయ పార్టీల తరపున 326 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 25, 57, 58 డివిజన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడగా, 323 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు.  

ఎన్నికల నిర్వహణకు సంబంధించి వళ్ళూరు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటర్లు ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కు తగిన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అక్టోబర్ 31, 2026 న ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రారంభమవుతుందని, నవంబర్ 01, 2026 న పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రిని అదే ప్రాంగణంలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.  

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలోని మొదటి, రెండవ అంతస్తుల్లో స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కంపు హాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 500 బ్యాలెట్ బాక్సులను రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్దేశిత స్ట్రాంగ్ రూమ్ లో పోలీసు భద్రత మధ్య భద్రపరచడం జరిగిందని, వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించే వరకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.  

ఎన్నికల నిర్వహణ కోసం 22 రవాణా మార్గాలను గుర్తించి, 22 మంది రూట్ అధికారులను నియమించడం జరిగిందని, వీరిని 6 జోనల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని, ఏపీఎస్ ఆర్టీసీ, జిల్లా రవాణా కమిషనర్ ద్వారా బస్సుల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కంపు సిబ్బందికి అక్టోబర్ 22 నుండి 26 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 538 మంది ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, అక్టోబర్ 26 న ఓట్ల లెక్కంపు సిబ్బందికి శిక్షణ నిర్వహించామని, వీరిలో 180 మంది లెక్కంపు సూపర్వైజర్లు మరియు వారి సహాయకులు, 17 మంది రిటర్నింగ్ అధికారులు, 34 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారని, మొత్తం 230 మంది లెక్కంపు సిబ్బందికి శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు.  

  ఆర్హులైన ఎన్నికల సిబ్బంది కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సూచనల మేరకు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రన్ని ఏర్పాటు చేశామని, అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సౌకర్యం ఉంటుందని తెలిపారు. 62 వార్డుల్లో పంపిణీ చేసేందుకు ఓటు సమాచార స్లిప్పులను బూత్ స్థాయి అధికారులకు (BLOలకు) అందజేయడం జరిగిందని, పంపిణీ అక్టోబర్ 27 న ప్రారంభమైందని, ఈ ప్రక్రియను అక్టోబర్ 28 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు.  

ఓటర్లు, రాజకీయ పార్టీలు తమ ఓటు, ఎన్నికల సంబంధించిన వివరాలను ఏపీఎస్ఈసీ ఓటర్ పోర్టల్ ద్వారా పరిశీలించుకోవచ్చని (https://sec-ems.ap.gov.in/apsec/voterPortal), ఈ సౌకర్యంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించాలని  ఆయన కోరారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వినియోగం, ప్రచార వాహనాలు, వేదికలు, పందిళ్ళు, బ్యానర్లు, హోర్డింగ్ లు, పోస్టర్లు తదితర కార్యక్రమాలకు సంబంధించిన పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ లేదా ఇతర శాఖల అనుమతులు అవసరమైన సందర్భాలలో అభ్యర్థులు లేదా వారి  ప్రతినిధులు ముందస్తు అనుమతి పొందాలని, ప్రచారానికి వినియోగించే వాణిజ్య వాహనాలకు మున్సిపల్ కమిషనర్ అనుమతి అవసరమని, వీడియో రథాలు వంటి ప్రత్యేక వాహనాలకు సంబంధించిన రవాణా అధికారుల అనుమతి తీసుకోవాలని, అవసరమైన అనుమతుల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

    ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్నికల సహాయ కేంద్రం పనిచేస్తోందని, ఈ కేంద్రం ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుండి రాత్రి 10.00 గంటల వరకు రెండు షిఫ్ట్ లలో ప్రజలకు, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సహాయం అందిస్తుందని, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీ వివేకానంద నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.  

చివరగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులను కోరుతున్నామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.