అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి
కురచా రమేష్
మేజర్ న్యూస్ విమాడుగుల చీడికాడ మండలం నుండి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా కూటమి తరుపున పోటీ చేస్తున్న యువ నేత కురచా రమేష్ . మంగళవారం అప్పల రాజపురం, బి .సింగవరం, సూర్యనారాయణపురం, తదితర గ్రామాలలో ఉదయం నుండి ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మధ్యహ్న సమయానికి మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు ఇంటి ప్రాంగణంలో ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు అడుగింటిన అభివృద్ధి కూటమి పాలనలో నాయకుల అద్భుతమైన ఆలోచనలతో అభివృద్ధి దూసుకుపోతుందని అన్నారు. మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అది నాయకులకు మరింత సహకారం అందించేందుకు గాను నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని, రాబోవు ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని అందరినీ వేడు కున్నారు. చీడికాడ కోపరేటివ్ అధ్యక్షులు గవిరెడ్డి జగన్నాథం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కురచా సురేష్, దేశం పార్టీ సీనియర్ నాయకులు గవిరెడ్డి శ్రీనివాసరావు, స్కూల్ కమిటీ చైర్మన్ రాళ్లపల్లి ఎర్రి నాయుడు, నీటి సంఘం నాయకులు కొటకల రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాళ్ళ అప్పలనాయుడు, పలువురు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.