అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్.
అనకాపల్లి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్: అనకాపల్లి మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "పల్లేల వెంకట సీతమ్మ దొర (పల్లేల సాయి కిరణ్)"ని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పార్టీ నాయకులతో కలిసి అధికారికంగా బి-ఫారం అందజేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి బలమైన పట్టు ఉండటంతో, 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన, విద్యావంతుడైన, క్లీన్ ఇమేజ్ కలిగిన యువ నాయకుడుగా గుర్తింపు పొందిన కుంచంగి గ్రామానికి చెందిన పల్లేల సాయి కిరణ్ ను బరిలోకి దింపడం ద్వారా వైసీపీ గెలుపు వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, మాజీ ఎంపీపీ గొర్లి సూరిబాబు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మలసాల కుమార్ రాజా, మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భరత్, జై జగన్, జై వైయస్ఆర్ సీపీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.