ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం
ఉదయగిరి మేజర్ న్యూస్ : మండలంలోని పది ఎంపీటీసీ స్థానాల్లో ఒక ఎంపిటిసి టీడీపీ ఏక గ్రీవంగా కైవసం చేసుకుంది. కొండాయపాలెం నుంచిటిడిపి మండల కన్వీనర్ చింతన బోయిన బయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో వెంకటరెడ్డి ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు. పది ఎంపిటిసి స్థానాల్లో 98నామినేషన్లు రాగా మూడు నామినేషన్లు తిరస్కరించాగా 11మంది రెండు నామినేషన్లు వేశారు. మంగళవారం ఉపసంహరణలు 50 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 9 స్థానాలకు గాను 33 మంది బరిలో ఉన్నట్లు ఆర్వో వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఏక గ్రీవంగా ఎన్నికైన బయ్యన్న ను మాజీ ఏఎంసి చెర్మన్ మన్నేటి వెంకట రెడ్డి, దుత్తలూరు మాజీ ఎంపిపి శ్రీకూర్తి రవీంద్రబాబు,బొజ్జ నరసింహులు తదితరులు అభినందించారు.