BREAKING
నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి..

Select Suryaa Now
34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి..   టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!..   సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి..

(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 34వ డివిజన్‌లో స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలతో మమేకమై, డివిజన్ అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొంటూ ఓటర్లను మద్దతు కోరుతున్నారు.సాయి నగర్ 8వ క్రాస్, అశోక్ నగర్, జీసస్ నగర్ రేణుక ఎల్లమ్మ నగర్, విద్యుత్ నగర్ ప్రాంతాల ఓటర్లను ఉద్దేశించి ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గత 50 సంవత్సరాలుగా సేవే పరమావధిగా భావించి జీవించిన చిన్నపరెడ్డి సంజీవరెడ్డి కుమారుడిగా, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ముందుకు వస్తున్నానని తెలిపారు.డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం! 34వ డివిజన్‌ను అనంతపురం నగరంలోనే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.చీకటిని తొలగించే వెలుగుగా టార్చ్‌లైట్!
“చీకటిని తొలగించే వెలుగై.. ప్రజల ఆశలకు దారిచూపే దీపమై.. మన డివిజన్ అభివృద్ధికి ముందడుగు వేద్దాం” అంటూ టార్చ్‌లైట్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తనకు కేటాయించిన టార్చ్‌లైట్ గుర్తుపై ఓటు వేసి, బంధుమిత్రులు, పరిచయస్తులతో కూడా ఓటు వేయించి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ఆశీర్వాదమే నా బలం!.34వ డివిజన్ ప్రజల ఆశీర్వాదం, సహకారంతో విజయం సాధిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. డివిజన్ అభివృద్ధి కోసం తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరుతూ, తన అమూల్యమైన ఓటును టార్చ్‌లైట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను మనస్ఫూర్తిగా అభ్యర్థించారు.