ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం
- నూతన ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లుకు అభినందనల వెల్లువ
- పూలదండలతో సత్కరించి స్వీట్లు తినిపించిన సభ్యులు
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల నూతన ఎంపీపీగా ఎన్నికైన పువ్వాడి వెంకటేశ్వర్లును, ఆయన సతీమణి తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ సభ్యురాలు పువ్వాడి వెంకటలక్ష్మిని నూతనంగా ఏకగ్రీవమైన ఎంపీటీసీ సభ్యులు ఘనంగా అభినందించారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో పువ్వాడి దంపతులకు పూలదండలు వేసి సత్కరించారు. అనంతరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలానికి నూతన ఎంపీపీగా పువ్వాడి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆయన సతీమణి పువ్వాడి వెంకటలక్ష్మి కూడా ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పువ్వాడి కుటుంబానికి ఎంపీటీసీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఏలూరి వెంకటేశ్వర్లు, అడుసుమల్లి ప్రభాకర్, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, యాదాల వెంకట సాయి కిరణ్, ఉప్పుగండ్ల రమేష్, చుంచు కొండయ్య, ఏలూరి మాధవరావు, మల్లెబోయిన బాల బ్రహ్మయ్య, దయండే శివశంకర్,మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.