హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక
హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక
????ఏడు దశాబ్దాల చరిత్రలో తెలంగాణకు తొలిసారి చోటు
????జాతీయ చేనేత వేదికపై తెలంగాణ కీర్తి పతాకం
????గట్టుప్పల్ నుంచి ఢిల్లీ వరకు విజయ ప్రస్థానం
???? తెలంగాణ చేనేత రంగానికి దక్కిన అరుదైన గౌరవం
మునుగోడు,మేజర్ న్యూస్:
భారతీయ చేనేత రంగంలో తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హ్యాండ్లూమ్ హౌస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా గట్టుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ చరిత్రలో తెలంగాణకు తొలిసారిగా ఈ స్థాయిలో ప్రాతినిధ్యం లభించింది.గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు సాగిన వజ్రమ్మ ప్రయాణం మహిళా నాయకత్వానికి, తెలంగాణ చేనేత రంగానికి గర్వకారణంగా నిలిచింది. జనరల్ బాడీ సభ్యురాలిగా ఎన్నిక కావడం నుంచి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వరకు ఆమె వరుస విజయాలు సాధించారు. ఈ క్రమంలో ఆప్కో మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశం అనుభవం, సహకార రంగంపై అవగాహన కూడా తోడ్పడ్డాయి.కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల ప్రతినిధుల మద్దతుతో వజ్రమ్మ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఢిల్లీలో జరిగిన ఈ పరిణామం తెలంగాణ చేనేతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయనే ఆశలను పెంచింది.పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్ వంటి ప్రాంతాల చేనేత కళాకారుల ఉత్పత్తులకు జాతీయ మార్కెట్‌లో మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ ప్రాతినిధ్యం దోహదపడుతుందని చేనేత వర్గాలు ఆశిస్తున్నాయి. కళాకారుల సమస్యలను జాతీయ స్థాయిలో వినిపించి, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా వజ్రమ్మ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
వజ్రమ్మ విజయంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘాలు, చేనేత సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారు. ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించి తెలంగాణకు జాతీయ చేనేత వేదికపై తొలి స్థానం అందించిన కర్నాటి వజ్రమ్మ ఎన్నిక రాష్ట్ర చేనేత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.