బీఫారాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో
మెళియాపుట్టి. అక్టోబర్ 27 మేజర్ న్యూస్...స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి బీఫారాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని టెక్కలి ఆర్డీవో కె.కృష్ణమూర్తి అధికారులకు సూచించారు. మంగళవారం మెళియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా బీఫారాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన పత్రాల పరిశీలన తీరును సమీక్షించారు. అభ్యర్థులు సమర్పించే బీఫారాలు, ఉపసంహరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి సీహెచ్ నరసింహులు, సహాయ రిటర్నింగ్ అధికారి పి.నరసింహప్రసాద్‌కు సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి దశను జాగ్రత్తగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో తాసిల్దార్ టి రాము, ఏపీవో రవి, ఎంఈఓ. పద్మనాభరావు, హౌసింగ్ ఏఈ గణేష్, ఈసీ ఆదినారాయణ రెడ్డి, నాయుడు, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ, అధికారులు పాల్గొన్నారు.