BREAKING
సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు జేపీ మోర్గాన్ లైంగిక వేధింపుల కేసులో అబద్ధాలు చెప్పాలంటూ మాజీ బ్యాంకర్ రాణా ఒత్తిడి శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

లోతట్టు నదీ పరివాహక,ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి.

Select Suryaa Now
లోతట్టు నదీ పరివాహక,ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి.

శ్రీకాకుళం, అక్టోబర్ 27 మేజర్ న్యూస్:;బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ  కె.వి. మహేశ్వర రెడ్డి మంగళవారం పోలీసు అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు, తీరప్రాంతాల్లో వరద ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

ముందస్తు చర్యలపై పోలీసు అధికారులకు ముఖ్య ఆదేశాలు: ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో నాగావళి నది పరివాహక ప్రాంతంలో ప్రజలను అవసరమైన సందర్భాల్లో  సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, విద్యుత్‌, విపత్తు నిర్వహణ, వైద్య తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
లోతట్టు, ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.(SDRF) ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సంసిద్ధత,.. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచి, అవసరమైన రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ శాఖ సమన్వయంతో సురక్షిత షెల్టర్లను గుర్తించి, తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలి.నదులు, తీరప్రాంతాల పర్యవేక్షణ: నాగావళి, వంశధార, బహుదా నదుల్లో వరద ఉద్ధృతిని, తీరప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఈదురుగాలులకు చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, వాటిని తొలగించేందుకు అవసరమైన వాహనాలు, సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలి.డ్రాగన్‌ లైట్లు, లైఫ్‌ జాకెట్లు, తాళ్లు, ఇతర అత్యవసర రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోని,వరదనీరు ప్రవహించే రహదారులు, కల్వర్టులు, ప్రమాదకర మార్గాల్లో రాకపోకలను నియంత్రించి, అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు సమాచారం అందించాలి,పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, డయల్ 112, 6309990933 పోలీసు కంట్రోల్ రూమ్ కు అత్యవసర సమాచారంపై తక్షణమే స్పందించాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.

ప్రజలకు విజ్ఞప్తి:
తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. నదులు, వాగులు, చెరువులు, నీటితో నిండిన కల్వర్టులు, సముద్ర తీర ప్రాంతాల వద్దకు వెళ్లకూడదు. అధికారుల సూచనలు, వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి.