BREAKING
శ్రీలంక టెస్ట్ జట్టుకు భారీ షాక్.. పాకిస్తాన్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక దూరం ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ 'కల్షి' కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారానికి , పోలేపల్లి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను.!!!.తిమ్మా నాయుడు దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు. చిప్ సరఫరా ఒప్పందాన్ని విస్తరించిన ఒరాకిల్.. గూగుల్, సెరెబ్రాస్ సేవలు జత సిమెన్స్ సంస్థకు $1.36 బిలియన్ల హైస్పీడ్ రైళ్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిన స్పానిష్ రెన్ఫే అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తేదేపా గెలుపు ఖాయం. నియోజకవర్గ తేదేపా పరిశీలకులు.యం గంగాధర్. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం

మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి... -56వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

Select Suryaa Now
మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి... -56వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇదే డివిజన్ పరిధిలో నివాసముంటున్న తనను మీ ఇంటి ఆడబిడ్డగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆదరించి ఓటు వేసి గెలిపించాలని కొర్లగుంట ప్రచారంలో 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ మహిళలను కోరారు. ప్రచారంలో భాగంగా మంగళవారం కొర్లగుంట ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ స్థానికరాలైన తనను గెలిపించాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. గతంలో రోడ్డు విస్తరణలో చాలామందికి టీడీఆర్ బండ్లు అందలేదని, అలాగే కొంతమందికి చెక్కులు ఇస్తే కమిషన్లు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యను పరిష్కారం కోసం ఆ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గతంలో పనిచేసిన అనుభవంతో అధికారుల సమన్వయంతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనతో పాటు మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఢిల్లీ బాబు, డాక్టర్ స్వప్న ప్రియ, వాసంతి, స్రవంతి, జయంతి, విజయ్, సుబ్బయ్య, చైతన్య పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్