BREAKING
వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!.

"వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి"

Select Suryaa Now
"వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి"

 నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని 59వ డివిజన్ లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కిషన్ , మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి  ని గెలిపించమని కోరుతూ శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు, వైయస్సార్ సిపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన, మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు " డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి 

శ్రీరామ మందిరంలో చంద్రశేఖర్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి, కిషన్  తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకాణి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ : 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏ విధంగా దురాగతాలు జరుగుతున్నాయి? నిత్యావసర వస్తువులు ఏ విధంగా మండిపోతున్నాయో నెల్లూరు నగర ప్రజలు ఆలోచన చేయాలన్నారు, జగన్ మోహన్ రెడ్డి   ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యవసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు.  నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ... ఎక్కడా లేనటువంటి విధంగా పేదవాడి గొంతు మీద కత్తి పెట్టి... మీరు పన్నులు కడతారా లేదా? అని ముక్కు పిండి పన్నులు వసూలు చేశారని అవి నగర అభివృద్ధికి ఉపయోగించకుండా చెట్ల పేరుతో, చెత్త పేరుతో  దోపిడీ చేశారని విమర్శించారు.  నారాయణ నెల్లూరు నగర ప్రజల అభివృద్ధి గురించి గాని, సంక్షేమాన్ని గురించి గాని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు   కార్పొరేషన్ ఎన్నికల్లో  అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గరి నుంచి ఆనం కుటుంబం ఎన్నో తరాలు గా నెల్లూరు నగరానికి,మున్సిపాలిటీకి సేవలు అందించిన ఆనం కుటుంబ వారసుడిగా, విజయ్ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా  జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో  పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి విజయ్ అన్నని, కార్పొరేటర్ గా కిషన్ ని గెలిపించాలని కోరారు  చంద్రబాబు నాయుడు నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు పదవి అవసరం లేదు, అని డబ్బా కొట్టుకుంటున్నాడని, రాష్ట్రం లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ప్రజలందరూ ఆలోచన చేయాలని, ఎక్కడ చూసినా  దాడులు, దౌర్జన్యాలు , అరాచకాలు తప్ప ఎక్కడా అభివృద్ధి ఊసే కనిపించడం లేదని పేర్కొన్నారు  జిల్లా లో కొందరు పోలీస్ అధికారులు ఉద్యోగాన్ని పక్కనపెట్టి , దళారులుగా  వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు, డీఎస్పీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడికి ఫోన్ చేసి ఎన్నికల్లో 'నువ్వు డ్రాప్ కావాల్సిందే! నువ్వు పోటీ చేయడానికి లేదు! నువ్వు పోటీ చేస్తే ఒప్పుకోము, నీకేం కావాలో చెప్పు, రెండు సీట్లు కావాలా? మూడు సీట్లు కావాలా?' అంటూ బేరమాడుతున్నారని ,డీఎస్పీగా,, సీఐలుగా ఎస్సైలుగా మిమ్మల్ని నియమించింది,మీరు పనిచేసేది, ప్రజలకు శాంతిభద్రతలు కాపాడడానికా? లేదా అధికార పార్టీ నాయకులకు కుమ్ము కాయడానికా ..అని విమర్శించారు  

పోలీసులు శాంతిభద్రతలకి విఘాతం కలిగినా పరవాలేదు, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బెదిరించి ఏదో ఒక విధంగా  ఏకగ్రీవాలు చేయించాలని తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు  చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ చీ కొడుతున్నారని . నెల్లూరు నగర ప్రజలు ముఖ్యంగా చంద్రబాబు అంటేనే ఎగిరిపడేటువంటి పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నేను ఈ అభివృద్ధి చేశాను, ఈ సంక్షేమం అందించాను నాకు ఓటు వేయండి అని చంద్రబాబు అడిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు  కూటమి రెండున్నర సంవత్సరాల పాలనను చూసి   ప్రజలు చంద్రబాబు నాయుడు కి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ,పోలీసులను అడ్డుపెట్టుకొని రకరకాలైనటువంటి గుండాలని, గంజాయి బ్యాచ్‌లను దించి,  వాళ్ళ ద్వారా వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడులు చేయించి, వారికి  సంబంధించినటువంటి వ్యాపారస్తులను, స్థానికంగా ఉండేటువంటి నాయకులను బెదిరించి, వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి ఏకగ్రీవాలు బలవంతంగా చేయించి, అధికారుల చేత మా నామినేషన్లు తిరస్కరింప చేయించి దాన్ని విజయంగా మీరు భావిస్తారా? అని ప్రశ్నించారు  చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల్లో ఎప్పుడో  ఓడిపోయాడని. కేవలం  అధికార బలాన్ని ఉపయోగించుకొని ,తాము గెలిచామని ప్రకటించుకోవడానికి తాపత్రయ పడుతున్నాడు తప్ప, ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని గెలవాలి అనేటటువంటి పరిస్థితి లేదన్నారు   ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన విజయన్నను  గెలిపించుకుంటే  నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుందని. వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందర్నీ గెలిపించి  ఒక మంచి టీమ్‌ని విజయన్న కు ఇస్తే నెల్లూరు నగరం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు  నెల్లూరు నగరంలో వ్యాపారాలు గురించి గాని, ఆర్యవైశ్యుల గురించి గాని పట్టించుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, స్థానికంగా ఆనం కుటుంబం అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తుంచుసుకోవాలన్నారు .  కార్పొరేషన్ ఎన్నికల్లో బెదిరింపులకి, ప్రలోభాలకి, బ్లాక్‌మెయిలింగ్‌కి లొంగకుండా ,విజయన్నకి  ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా నెల్లూరు నగరంలో కార్పొరేటర్లగా పోటీ చేస్తున్న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు  స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతున్నామన్నారు