BREAKING
నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్

Select Suryaa Now
ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్

పరిగి, మేజర్ న్యూస్:  దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో కరువు పరిస్థితి పై  మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ప్రణాళిక బద్ధంగా ఎదుర్కోవాలని పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్ అన్నారు.  మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ నినో పరిస్థితుల పై సర్వసభ్య సమావేశం నిర్వహించారు .  సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటడం మరియు రానున్న వేసవి కాలంలో త్రాగునీటి కొరత వంటి సమస్యలపై ముందస్తు చర్యలను తీసుకునేందుకు అవసరమైన సలహాలను సూచనలని సభ్యుల నుంచి తీసుకొని అమలు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.  కరువు పరిస్థితులపై ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్దామని సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ సేవలు అందించాలని వాస్తవాలను వివరించి అపోహలను వదంతులను నమ్మకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండి సమిష్టిగా ఎదుర్కునేందుకు సహకరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ హనుమంతు, కౌన్సిలర్లు కుర్వ నరేష్ యాదవ్, ఎజాస్, రవికుమార్, రవీంద్ర, భాస్కర్  కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, అక్బర్ హుస్సేన్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయూబ్ , నాయకులు శివన్నోళ్ళ భాస్కర్, మీర్ తాహెర్  అలీ,బాలరాజు, శ్రీనివాస్, చంద్రయ్య, ఆనంద్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.