BREAKING
బొడ్డేటి మాధవి కిరణ్ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలి బుద్ధ శివాజీ... మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి... -56వ డివిజన్ ఇంటింటి ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ తుఫాన్‌ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బీఫారాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిల సూర్య కళ జోరు వానలో ఎన్నికల ప్రచారం మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ కాల్స్ గంభీరం రిజర్వాయర్‌ వద్ద అప్రమత్తంగా ఉండాలి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాను -60వ డివిజన్ ప్రచారంలో సుధాకర్ రెడ్డి హామీ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు.. ఆనందపురం జడ్పీటీసీ స్థానం జనసేనకు..!! కరగాం ఎంపీటీసీ అభ్యర్థిగా పంగ జైచంద్రకుమార్.. ఓవర్సీస్‌లో రణబాలి సునామీ.. బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ రికార్డు వసూళ్లు అర్ణబ్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు!

Select Suryaa Now
అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు!

సూర్య - మానకొండూర్ : మండల పరిధిలోని అన్నారం పెట్రోల్ బంక్ మలుపు వద్ద మంగళవారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న ఇసుక లారీ.. అదే దిశలో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూరు మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చిల్ల అనిల్, వీణవంక మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన కొలిపాక అంజిలు మద్దికుంటలో జరగబోయే ఒక కార్యానికి సంబంధించి సామాగ్రి తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ బయలుదేరారు. మార్గమధ్యలో అన్నారం పెట్రోల్ బంకు మలుపు వద్దకు రాగానే, వీరి బైక్ వెనుక నుండి వచ్చిన ఒక ఇసుక లారీ.. సైడ్ నుండి వెళ్తున్న బైక్‌ను నిర్లక్ష్యంగా కట్ చేస్తూ బలంగా తాకించింది.
లారీ కట్ చేస్తూ తాకడంతో ద్విచక్ర వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న కొలిపాక అంజికి శరీరమంతా తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకుపోయాడు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన అంజిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ నడుపుతున్న అనిల్ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.ఈ మార్గంలో ఇసుక లారీల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, లారీ డ్రైవర్లు మలుపుల వద్ద కూడా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇతర వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ, బైక్ రెండూ కూడా ఒకే వైపు మలుపు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.