BREAKING
నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన

Select Suryaa Now
సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర  కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన

'సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర  కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్
శ్రీదేవసేన

????సర్ ప్రక్రియను పరిశీలిన

????ఓటరు జాబితాలో విఐపి ఓటర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలీ

????హియరింగ్ తర్వాత ఇంటికి వెళ్లి సమాచారం ఇస్తున్నాం: జిల్లా కలెక్టర్
బి.చంద్రశేఖర్

మునుగోడు,మేజర్ న్యూస్:

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర  కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్
శ్రీదేవసేన అన్నారు. 
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా ,మునుగోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 171 వ పోలింగ్ కేంద్రంలో "సర్" ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా 
బిఎల్ఓ పద్మతో ముఖాముఖి మాట్లాడుతూ సర్ ప్రక్రియ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. కొత్తఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో తొలగింపులు ,మార్పుచేర్పులను జాగ్రత్తగా  పరిశీలించి చేయాలని చెప్పారు.సర్ లో భాగంగా ఓటరు నమోదు,ఫారాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు వచ్చిన ఫారాలు,జారీ చేసిన నోటీస్ లు గురించి అడిగారు.  ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  సర్  షెడ్యూలు   ధ్రువ పత్రాలు పరిశీలించిన  విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఓటరు నమోదుకై ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ,వాటి పరిశీలన ధ్రువ పత్రాల పరిశీలన, మ్యాపింగ్ కానీ ఓటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, ధ్రువపత్రాల ఆధారంగా ఇల్లిల్లు పరిశీలన, ఎలా నిర్ధారణ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటరు జాబితా నుండి తొలగింపులు ఏ విధంగా చేస్తున్నారని? ఒక ఓటరు కు రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే ఒకేసారి రెండు చోట్ల తొలగించకుండా ఒకచోట ఓటరుగా కొనసాగేందుకు వీలైనంతవరకు నిర్ధారణ చేసుకోవాలని చెప్పారు. ఓటరు జాబితా లో విఐపి ఓటర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా నమోదు చేయాలని, నోటీసులు జారీ చేసిన ఓటరుకు హియరింగ్ తర్వాత ఓటరు జాబితాలో తన పేరు తిరస్కరించిన లేదా అనుమతించిన వివరాలన్నింటిని తప్పనిసరిగా తెలియజేయాలని  చెప్పారు . నోటీస్ లు జారీ చేసిన ఓటర్లకు హియరింగ్ తర్వాత తన పేరు ఓటరు జాబితాలో ఉన్నది లేనిది ఇంటికి వెళ్లి తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్  తెలిపారు. రెవెన్యూ అదనపు  కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన  చింగ్ థియాన్ మావి, చండూర్ ఆర్డీవో వందనపు శ్రీదేవి,మునుగోడు తహసిల్దార్ నెలపట్ల నరేష్,మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకూర్ బిక్షం గౌడ్, ఆర్ఐ చింతనూరీ వంశీ ప్రసాద్, జిపివో బొల్లేద్దు లింగస్వామి తదితరులు ఉన్నారు.