BREAKING
ప్రాణనష్ట నివారణే లక్ష్యం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి

రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Select Suryaa Now
రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రామాయంపేట ; వానాకాలం వరి కోతలు ప్రారంభమైనా రామాయంపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించేందుకు అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ప్రస్తుతం పలుచోట్ల వరి కోతలు ప్రారంభం కావడంతో ధాన్యాన్ని పొలాల వద్దే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంపై రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, గన్నీ సంచులు, తాగునీరు, షెడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు.