ప్రాణనష్ట నివారణే లక్ష్యం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ పరిస్థితులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ముందస్తుగా ప్రయాణాలను రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తుఫాన్ వేగం, దిశ నిరంతరం మారుతున్న నేపథ్యంలో యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశామన్నారు. బాధితుల కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్‌లను మోహరించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులను ఆదేశించారు.