BREAKING
అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వింజమూరు మండలంలో స్థానిక సంస్థలు ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

సీట్లు సర్దుబాటులో సమన్వయం ఏది

Select Suryaa Now
సీట్లు సర్దుబాటులో సమన్వయం ఏది

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో సమన్వయం లోపించిందని కడియం మండల బీజేపీ అధ్యక్షుడు బొరుసు సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికకు ముందు మూడు పార్టీల మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించి ఉంటే ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చేవి కావన్నారు.

కార్యకర్త స్థాయి నుంచి కాకినాడ పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఎదిగిన ఆకుల శ్రీధర్ కడియం జడ్పీటీసీ స్థానం కోసం ప్రయత్నించారని తెలిపారు. ఆయనకు అవకాశం కల్పించేందుకు బీజేపీ అధిష్ఠానం కృషి చేసినప్పటికీ, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు దక్కిందని వివరించారు.

ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ నాయకత్వంపై అపోహలు సృష్టించడం సరికాదని, పార్టీపై బురదజల్లే ప్రయత్నాలను సహించేది లేదని సుబ్రమణ్యం హెచ్చరించారు. మిత్రధర్మానికి కట్టుబడి టీడీపీ, జనసేనతో కలిసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మిత్రపక్షాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.