BREAKING
22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి టిడిపి 39 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ...ఇంటింటా ప్రచారానికి భారీ స్పందన ఓటీటీలోకి సందీప్ కిషన్ సిగ్మా సినిమా.. అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రచారంలో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డికి జననీరాజనాలు - ఆదరిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఓటర్ల స్లిప్పులు పంపిణీ సక్రమంగా జరగాలి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యాన్‌గా హాలీవుడ్ నటుడు నోవా వైల్.. పీపుల్స్ మ్యాగజైన్ అరుదైన గౌరవం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ముమ్మర ప్రచారం - అడుగడుగునా ఘన స్వాగతం హుషారు 2 టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ కళ్యాణ్ చక్రవర్తి తనిఖీలు. గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం.. సైకిల్ వర్సెస్ గ్లాస్! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 17 మందికి జైలు శిక్ష పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ఏబీఎం పాలెంలో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు

Select Suryaa Now
జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు

కావలి,  మేజర్ న్యూస్ :  రాబోయే స్థానిక ఎన్నికల్లో జడ్పీ పీఠంపై తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారాలను లాంఛనంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పార్టీ పరిశీలకులు డూండి రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొని అభ్యర్థులకు బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం
బీఫారాల పంపిణీ అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వర్యులునారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జెడ్పీటీసీ అభ్యర్థులందరితో జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి, ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పనిచేస్తామని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు.
ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించాలి
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, వార్డు/గ్రామ స్థాయిలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి జెడ్పీటీసీ స్థానాల్లో ఘన విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.