BREAKING
తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

Select Suryaa Now
కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తాడూరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి హాజరైన విద్యార్థినుల విద్యాభ్యాసం, బోధన తీరుతో పాటు పాఠశాలలో వారికి అందిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. సెలవుల అనంతరం ఎంతమంది విద్యార్థినులు పాఠశాలకు హాజరయ్యారనే అంశంపై ఆరా తీశారు. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థినుల హాజరు శాతాన్ని పరిశీలించి, పాఠశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను సమీక్షించారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల క్రమబద్ధమైన హాజరు, విద్యార్థినుల నిరంతర హాజరు కీలకమని పేర్కొంటూ, విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కలెక్టర్ పరిశీలించారు. భోజన వివరాలను తెలుసుకుని, ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. బాలికలకు విద్యతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కేజీబీవీ పాఠశాలలో విద్యాబోధన, హాజరు, పౌష్టికాహారం, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, పాఠశాల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

సందడి రవీందర్ రెడ్డి నాగర్ కర్నూల్ ,రూరల్, సూర్య న్యూస్: