BREAKING
తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత.

Select Suryaa Now
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత.

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత.                పెడన, మేజర్ న్యూస్  : అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు  తీర ప్రాంత ప్రజలను అధికారులు తరలించడంతో అక్కడ ఉన్న ప్రజలకు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అక్కడ ఉన్న ప్రజలను ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలోని తీర ప్రాంతాల్లో పర్యటించి తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను పరిశీలించామన్నారు . పునరావాస కేంద్రాల్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను సమీక్షించి, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు . మత్స్యకారులు, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ,వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని  విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.