BREAKING
ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు

Select Suryaa Now
రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతమ వైసిపి ప్రభుత్వ పాలనలో రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇవిఎం ఎమ్మెల్యే సర్వనాశనం చేస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ పార్లమెంటు సభ్యుడు, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక చర్చి గేటు వద్ద నుంచి గీతా అప్సరా ధియేటర్ వరకు పైప్‌లైన్లు వేయడానికి తవ్విన రోడ్లను మార్గాని భరత్ రామ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డుపై తవ్విన గోతిలో పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలల నుంచి ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి, ఇవిఎం ఎమ్మెల్యే, అధికారులు బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పైప్ లైన్‌కు తవ్విన పెద్ద పెద్ద గోతుల్లో పడి ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని నిలదీసారు. ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, కమీషనర్ ఇంత మంది అధికారులు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పనులు వేగంగా పూర్తి చేసి వెంటనే గోతులు పూడ్చి తారు రోడ్డు వేయాలని డిమాండ్ చేసారు. నగరంలో ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఎప్ప్పుడూ చూడలేదన్నారు. ఒక టైమ్ పెట్టి కాంట్రాక్టర్‌తో పనులు ఎందుకు పూర్తి చేయించ లేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రజలకు, వాహన చోదకులు అసౌకర్యం కలిగితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేసారు. కలెక్టర్, కమీషనర్ తక్షణం స్పందించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసి ఆ గోతుల్లో నీరు చేరితే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోకపోతే మాత్రం వైసిపి ఆందోళన ఉదృతం చేస్తామని ఆమరణ దీక్ష కూడా పార్టీ చేపడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట వార్డు ఇంచార్జి కాటం రజనీకాంత్, కాటం ప్రియాంక, వైసిపి నాయకులు  అజ్జరపు వాసు, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, నిరీక్షణ జేమ్స్, యజ్జవరపు శ్రీనివాస్, షేక్ హసీనా, కృష్ణవేణి, పీతా రామకృష్ణ, కొల్లి నాని, మద్దు సతీష్, దూలం ప్రసాద్, వైసిపి వివిధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.  

``````