*రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనిధి విద్యార్థుల ఎంపిక*
మధిర, సూర్య మేజర్ న్యూస్:
ఖమ్మం లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-16 కబడ్డీ ఎంపికల్లో మధిర శ్రీనిధి పాఠశాల విద్యార్థులు మర్రిదు యోగి మరియు సయ్యద్ అహ్మద్, కూరాకుల జస్వంత్, ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విద్యార్థులు 36వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బి. అంజన్ బాబు మాట్లాడుతూక్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం చాలా గర్వకారణముగా ఉందన్నారు.విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. చందు , ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసరావు పీడీ ప్రవీణ్ కుమార్, పీఈటీ శివ పాల్గొని విద్యార్థులను అభినందించారు.