andhrapradesh
నగరం మండలంలో 33 మంది ఎంపీటీసీలు పోటీ
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది పోటీలో ఉన్నారు. టిడిపి 12, వైఎస్ఆర్సిపి 14, జనసేన 2, కాంగ్రెస్ పార్టీ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ ప్రకటించారు. పూడివాడ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కాసాని నెల్లిమ్మ, వైకాపా అభ్యర్థి సుజాత పాగోలు; అల్లపర్రు సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బాబు గుంటూరు, వైకాపా అభ్యర్థి కొప్పుల గోపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనపర్తి శ్రీనివాసరావు; ఏలేటిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ఉప్పాల యానాదమ్మ, వైకాపా అభ్యర్థి కోటేశ్వరమ్మ ఉప్పాల; ధూళిపూడి (నార్త్) సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ఆలూరి వెంకటేశ్వరరావు, వైకాపా అభ్యర్థి నన్నెపాముల దాసు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిశా హరీష్ పోటీలో ఉన్నారు. చినమట్లపూడి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి అబ్దుల్ జలీల్, వైకాపా అభ్యర్థి షేక్ అఫ్రోజ్ బేగం; బోరమాదిగపల్లి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కొక్కిలిగడ్డ హరిబాబు, వైకాపా అభ్యర్థి దేవదాసు చందోలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొరిగపూడి మనోహర్; అద్దంకివారిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి దుర్గాభవాని ఉయ్యూరు, వైకాపా అభ్యర్థి లుక్కా అనూష; పెద్దవరం సెగ్మెంట్ వైకాపా అభ్యర్థి పాగోలు శ్రీలత, జనసేన పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణమ్మ గోపరాజు పోటీలో ఉన్నారు. పెదపల్లి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి శొంఠి శ్రీనివాసరావు, వైకాపా అభ్యర్థి మోర్ల రాము; పెదమట్లపూడి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి పాగోలు శ్రీనివాసరావు, వైకాపా అభ్యర్థి కొప్పుల వెంకట శివరామకృష్ణ; మంత్రిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ప్రతాప్ వసంతం, వైకాపా అభ్యర్థి సబ్బినేని రామకృష్ణ; కొలగానివారిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి గుంటూరు శ్రీదేవి, వైకాపా అభ్యర్థి నన్నెపాముల సృజన పోటీలో ఉన్నారు. నగరం సెగ్మెంట్ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి, వైకాపా అభ్యర్థి ఉప్పాల వెంకట సుబ్బమ్మ; ఈదుపరి సెగ్మెంట్ వైకాపా అభ్యర్థి చింతల కౌసల్య, జనసేన పార్టీ అభ్యర్థి కళ్యాణి చింతల, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతల సుప్రియ, స్వతంత్ర అభ్యర్థి దామెర్ల ధనలక్ష్మి లు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల ప్రక్రియలో ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో అబిద్ హుస్సేన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.