*తుఫాను వేళ .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *మధిర మున్సిపల్ కమిషనర్ కె.శామ్యూల్ పాల్**
మధిర... సూర్య ప్రతినిది ; తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో .... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మధిర మున్సిపల్ కమిషనర్ కే. శామ్యూల్ పాల్ సూచించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తల అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి.
చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన నిర్మాణాల కింద వాహనాలను నిలపవద్దు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.