BREAKING
ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచారు ...... సైకిల్ కి ఓటేయండి తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి 17 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది అభ్యర్థులు పోటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు. మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

కిల్లర్ సినిమా చూశాక ఆ అనుభూతితో థ్రిల్ అవుతారు: డైరెక్టర్ పూర్వాజ్ ఇంటర్వ్యూ విశేషాలు

Select Suryaa Now
కిల్లర్ సినిమా చూశాక ఆ అనుభూతితో థ్రిల్ అవుతారు: డైరెక్టర్ పూర్వాజ్ ఇంటర్వ్యూ విశేషాలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం కిల్లర్. జ్యోతి పూర్వజ్ మరియు పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా మరియు ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ మరియు పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

సినిమా విడుదలకు ముందు చిత్ర విశేషాలను పంచుకుంటూ దర్శకుడు, నిర్మాత మరియు నటుడు పూర్వాజ్ మీడియాతో ముచ్చటించారు. కిల్లర్ ఒక రిచ్ కంటెంట్ ఉన్న సినిమా అని, ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తై క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందని తెలిపారు. సెన్సార్ సభ్యులు సినిమా చూశాక వారి ముఖాల్లో కనిపించిన ఆహ్లాదకరమైన నవ్వు తమ చిత్ర విజయంపై నూటికి నూరుపాట్లు నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. తమ సినిమాలో ఎలాంటి హింస లేదా రక్తపాతం ఉండదని, రక్తం చూస్తే తనకు కళ్లు తిరుగుతాయని ఆయన సరదాగా చెప్పారు. కథలో భాగంగా పాత్రలు ఎదుర్కొనే సంఘర్షణ ఉండాలి కానీ హింసను చిత్రహింసల రూపంలో చూపించడం తనకిష్ట ఉండదని, వాంపైర్ పాత్రను కూడా అందరూ మెచ్చేలా చాలా విభిన్నంగా ట్రీట్ చేసినట్లు వివరించారు.

ఈ సినిమా కథాంశం మరియు మేకింగ్ గురించి చెబుతూ, ఇది పూర్తిగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో సాగుతుందని, చిత్రంలోని ప్రతి పాత్ర పేరు కూడా ఆర్ అనే అక్షరంతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. హీరోయిన్ జ్యోతి పాత్రలు రక్తిక, రనైన, రియా అంటూ విభిన్న కోణాల్లో కనిపిస్తాయని వెల్లడించారు. దర్శకుడిగా, నిర్మాతగా మరియు నటుడిగా మూడు కీలక బాధ్యతలు నిర్వర్తించడంపై స్పందిస్తూ, ఇండస్ట్రీలో తనకు ఉన్న సుదీర్ఘ అనుభవం ఈ మల్టీ టాస్కింగ్ సులువుగా చేసేలా సహకరించిందని అన్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న మక్కువతో ఈ చిత్రంలో తానే స్వయంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించానని, తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కనిపెట్టిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించడంపై వస్తున్న స్పందన గురించి ఆయన మాట్లాడారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, సినిమా కథపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 29న రాత్రి జరిగే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ ద్వారా పంపవచ్చని, సరైన సమాధానం చెప్పిన వారి పేర్లు సక్సెస్ మీట్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని తెలిపారు. విజువల్స్ మరియు వీఎఫ్ఎక్స్ పరంగా అత్యున్నత నాణ్యతతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.