BREAKING
ప్రాణనష్ట నివారణే లక్ష్యం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి

నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ

Select Suryaa Now
నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ టాలెంటెడ్ నటి నజ్రియా నజీమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ భార్యగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న నజ్రియా, తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మరియు గ్లామర్ లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండటంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంపై మళ్లీ విడాకుల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

సూర్య మరియు నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సీన్ ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా నజ్రియా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ఒక ఆకర్షణీయమైన ఎల్లో కలర్ డిజైనర్ డ్రెస్ ధరించి కనిపించారు. అయితే ఎప్పుడూ పద్ధతిగా, క్యూట్ లుక్స్‌లో కనిపించే నజ్రియా ఈసారి కొంచెం గ్లామర్‌గా, డీప్ క్లీవేజ్ కనిపించేలా డిజైన్ చేసిన దుస్తుల్లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దుపట్టాతో కాస్త కవర్ చేసినప్పటికీ ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మునుపెన్నడూ లేనివిధంగా నజ్రియా ఇలా అందాల ఆరబోత చేయడం వెనుక అసలు కారణం ఏంటని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ విచిత్రమైన ప్రవర్తన మరియు గ్లామర్ లుక్స్ చూస్తుంటే భర్త ఫహాద్ ఫాజిల్‌తో ఆమెకు మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారానికి మళ్లీ బలం చేకూరుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్దికాలం క్రితం కూడా నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని, డిప్రెషన్ కారణంగా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇస్తున్నానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ జంట మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఫోటోలు షేర్ చేసి ఆ వార్తలకు చెక్ పెట్టినప్పటికీ, ఇప్పుడు తాజా ఈవెంట్ లుక్ చూశాక మళ్ళీ అదే చర్చ తెరపైకి వచ్చింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జోడీపై వస్తున్న ఈ వార్తలపై ఇప్పటివరకు నజ్రియా గానీ, ఫహాద్ ఫాజిల్ గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం లేదా కేవలం డ్రెస్సింగ్ ఎంపికలో భాగమైనప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సీన్ సినిమాతో నజ్రియా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఆమె పర్సనల్ లైఫ్ గురించిన ఈ వార్తలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.