ఆత్రేయపురం మండలం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాస్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆత్రేయపురం మండల జెడ్పీటీసీ స్థానానికి కూటమి పార్టీలు బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా మండలంలోని ర్యాలి గ్రామానికి చెందిన గూడపాటి శ్రీనివాసరావు బరిలో నిలిచారు ప్రస్తుతం అమలాపురం పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు విధేయుడిగా ఉంటూ, ఆయన నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అదేవిధంగా నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి