BREAKING
ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!* రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ 35వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో 40 కుటుంబాలు చేరిక సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు 'తులాభారం' సెట్స్‌లోకి అడుగుపెట్టిన రవితేజ.. 'క్రైమ్ మహారాజా'గా నవ శకం ప్రారంభం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి

విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, హాజీపూర్ మండలం కర్ణమామిడిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతులలో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి, వారి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం సకాలంలో అందించాలని, పాఠశాలలలో పరిశుభ్రతను పాటించాలని, విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ, రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.