టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు
పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం మండలం కలగటూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చరణ్ రెడ్డి, దొరబాబు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, శివారెడ్డి, పరమశివ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : అనిల్ కుమార్ యాదవ్