BREAKING
మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్‌ బస్సు ప్రమాదంలో మృతి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాక్సింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా బాక్సర్లు! తమ్ముడు జగదీష్ ను ఆశీర్వదించండి విడుదల బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ రగ్బీ చరిత్రలో అద్భుతం.. బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు! ఐఐటిఈ- అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమం రోజువారీ ఆహారంలో బీట్‌రూట్, పెరుగు చేర్చుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన ట్రెండ్స్ పాఠశాలలో నెట్ బాల్ కోర్టు ప్రారంభం పాండ చెరువు కట్టపై సీసీ రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో అప్రమత్తమైన పునరావాస కేంద్రాల ను పరిశీలించిన ఉన్నత అధికారులు రక్తదానం ప్రాణదానం తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం విజయవంతం ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి

వైకుంఠధామం అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి బోయపల్లి కొండల్‌రెడ్డి వినతి

Select Suryaa Now
వైకుంఠధామం అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి బోయపల్లి కొండల్‌రెడ్డి వినతి

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్  : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ వైకుంఠధామంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు, పలు కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. అన్నోజిగూడ జనరల్ వైకుంఠధామంలో ఇంకా మిగిలి ఉన్న సుమారు 20 శాతం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ ఆలయం నుంచి సూర్యనగర్, వెంకటసాయినగర్ కాలనీల వరకు, ఎన్‌టీపీసీ రోడ్డు నుంచి జైపురి కాలనీ వరకు సీసీ రోడ్లు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ వినతిపై డిప్యూటీ కమిషనర్ వాణి సానుకూలంగా స్పందించినట్లు బోయపల్లి కొండల్‌రెడ్డి తెలిపారు.