BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

మెదక్ జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

Select Suryaa Now
మెదక్ జిల్లా మొత్తం  కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

అల్లాదుర్గం.. మెదక్ జిల్లాలోని మొత్తం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సింగూరు జలాల సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం ప్రభుత్వానికి కోరారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందని ,కానీ మెదక్ జిల్లాలోని ఒక్క మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడం అన్యాయమన్నారు. మెదక్ జిల్లా లోని రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఏలినో ప్రభావంతో ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా కురువక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలకు న్యాయం చేసి మెదక్ జిల్లా లోని రైతాంగానికి అన్యాయం చేయడం  ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్ట్ పూర్తిగా డెత్ స్టోరేజ్ లో ఉందని, ఈ సీజన్లో వ్యవసాయానికి నీరు ఇచ్చే ఆస్కారం లేదని, అలాంటిది  జిల్లాను ఏ ప్రాతిపదికన కరువు ప్రాంతంగా ఎందుకు ఎంపిక చేయలేదో  రైతులకు వివరించాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురువక జిల్లాలో పూర్తిగా నీటిమట్టం తగ్గి బోర్ మోటార్ లు  ఎండిపోయే పరిస్థితి నెలకొని ఉందని , ప్రభుత్వం వెంటనే మెదక్ జిల్లాలోని అన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేనియెడల రైతుల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఖాయమన్నారు.