సూర్య రాజన్న సిరిసిల్ల ;;విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో కృషి చేయాలని సిరిసిల్ల రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి గడ్డం మేఘన అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల,గీతానగర్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు,జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ సూచనలతో సురక్షిత్ బచ్పన్ అభియాన్ పేరుతో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి మేఘన మాట్లాడుతూ,పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే నిర్భయంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాల గోప్యతను కాపాడుతూ వారికి మానసిక ధైర్యం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెచ్ఎం ఎం.తిరుపతి,లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్,న్యాయవాదులు ఆడెపు వేణు,కళ్యాణి,కుంట శ్రీనివాస్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.