BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి..

Select Suryaa Now
నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి..
సూర్య రాజన్న సిరిసిల్ల;; పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించి,బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం సిరిసిల్లలోని అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో ఐద్వా జిల్లా వర్క్ షాప్ నిర్వహించిన అనంతరం ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నిత్యవసరాలను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని విమర్శించారు.రెండు నెలల క్రితం వరకు తక్కువగా ఉన్న బియ్యం ధర ఇప్పుడు క్వింటాలుకు రూ.12,000 కు చేరి సామాన్యులు రెండు పూటలా తినలేని పరిస్థితి నెలకొందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి దళారులపై చర్యలు తీసుకొని, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యవసరాలను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల,జిల్లా అధ్యక్షురాలు ఆడెపు రజిత,సీఐటీయూ నాయకురాలు సూరం పద్మ,ఐద్వా నాయకురాళ్లు గట్ల సప్న, లలిత,మాధవి తదితరులు పాల్గొన్నారు.